: మనస్ఫూర్తిగా చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది: చంద్రబాబు

ఉజ్వల భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎదురుచూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్టం వెలిగిపోతుందని తాను మనస్ఫూర్తిగా చెప్పగలనని అన్నారు. ఈ ఉదయం రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్టులో 'పుష్కర వనం'కు ఆయన శంకుస్థాపన చేశారు. 250 ఎకరాల్లో తలపెట్టిన పుష్కరవనం పైలాన్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరూ చెట్లను పెంచేందుకు ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ప్రకృతిలో భాగంగా ఉన్న ప్రజలు, ఆ ప్రకృతి పరిరక్షణకు నడుం బిగించాలని సూచించారు. వివిధ రకాల మొక్కలు, వాటి సంరక్షణా పద్ధతులు, పెంచే విధానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు www.apforest.gov.in వెబ్ సైట్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, మొక్కలకు సంబంధించిన సమాచారమంతా అందుబాటులో ఉంచామని వివరించారు.

More Telugu News