: 'క్యాట్ ఈజ్ ఔట్ ఆఫ్ ది బ్యాగ్' అంటున్న నారా లోకేష్!
ఏపీ నేతల ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాప్ చేసిన విషయం బయటపడింది కాబట్టి, ఈ విషయంలో కేసీఆర్ సమాధానం ఏంటని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ ప్రశ్నించారు. తన ట్విట్టర్ ఖాతాలో పలు పోస్టింగ్స్ పెట్టిన ఆయన, "క్యాట్ ఈజ్ ఔట్ ఆఫ్ ది బ్యాగ్" (రహస్యం బట్టబయలైంది) అని అన్నారు. తాము చెబుతున్న విషయాన్నే, మరోసారి టెలికాం ఆపరేటర్లు చెప్పారని, దీనికి మీ సమాధానమేంటి? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. కేసీఆర్ అండ్ కంపెనీ చెప్పేదొకటి చేసేదొకటని, వాళ్లు ఔనంటే కాదని, ఫోన్‌ట్యాపింగ్ చేయలేదంటే చేశారని భావించాల్సి ఉంటుందని అన్నారు. తన స్వార్థం కోసం ప్రజలను బలిచేస్తున్న కేసీఆర్ వైఖరి కొనసాగుతూనే ఉందని, గతంలో విద్యార్థులను, ఇప్పుడు అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.