: సల్మాన్ ని సహాయం కోరుతున్న పాకిస్తాన్ జర్నలిస్టు

'భజరంగీ భాయ్ జాన్' సినిమా సూపర్ హిట్టైంది. సల్మాన్ జీవితంలో అద్భుతమైన పాత్ర పోషించాడంటూ అంటూ విమర్శకుల ప్రశంసలందుకున్న సినిమా. ఈ సినిమాలో సల్మాన్ తో పాటు 'చాంద్ నవాబ్' పేరిట నవాజుద్దీన్ సిద్ధిఖీ, పాకిస్థాన్ జర్నలిస్టు పాత్రను పోషించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్నాడు. ఈ పాత్ర జర్నలిస్టుగా హాస్యం పంచి, భజరింగీకి సహాయం చేసి మానవత్వాన్ని చాటుకుంది. ఈ పాత్ర సినిమా కోసం రూపొందించినదైనా, ఈ పాత్రకు స్ఫూర్తి మాత్రం పాకిస్థాన్ లో జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్న 'చాంద్ నవాబ్' కావడం విశేషం. అతని పేరునే ఈ పాత్రకు కూడా పెట్టారు. సినిమా విజయం సాధించిన సందర్భంగా చాంద్ నవాబ్ పాకిస్థాన్ లో ఓ గల్ఫ్ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, తన పేరు వినియోగించుకుని తనకు గొప్ప పాప్యులారిటీ తెచ్చిన సల్మాన్ ఖాన్ కు ధన్యవాదాలని అన్నారు. అయితే తన పేరు వినియోగించుకున్నందుకు తనకు పరిహారం ఇచ్చే వీలు లేదా? అని ఆయన సల్మాన్ ను ప్రశ్నించారు. తానో పేద జర్నలిస్టునని, చట్టాలు, న్యాయస్థానాల చుట్టూ తిరగలేనని చాంద్ నవాబ్ చెప్పారు. తనకు రావాల్సిన పరిహారాన్ని సల్మాన్ ఖాన్ ఇవ్వాలని చాంద్ నవాబ్ కోరారు.

More Telugu News