: అవసరముంటే కాంగ్రెస్ వాడుకుంటుంది... లేకుంటే పక్కన పెడుతుంది: జగన్

అనంతపురం జిల్లా పర్యటనలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ లో ఉన్నంతకాలం మంచివాడన్నారని, బయటికి వచ్చాక చంద్రబాబుతో కలసి కాంగ్రెస్ కేసులు పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ లో అవసరముంటే వాడుకుంటారని, లేకపోతే పక్కన పెడతారని ఆరోపించారు. రైతు భరోసాయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న జగన్ సభలో మాట్లాడుతూ రాహుల్ పై ధ్వజమెత్తారు. అవసరముంటే దండ వేయడం, లేకుంటే బండ వేయడం రాహుల్ కే చెల్లిందన్నారు. వైఎస్ చివరి బొట్టుదాకా ఇందిరాగాంధీ కుటుంబం కోసమే కష్టపడ్డారని, ఆయన బతికి ఉన్నంతకాలం పార్టీ ఆయనను గొప్పవాడని పొగిడిందన్నారు. ఆయన చనిపోయాక నేను ఓదార్పు యాత్ర నిర్వహిస్తే చెడ్డవాడన్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించి, ఇప్పుడు అన్యాయం జరిగిందని రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News