: ముగింపు అద్భుతంగా ఉండాలని చంద్రబాబు పిలిపించారు: బోయపాటి శ్రీను

ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ఈరోజు కుటుంబ సమేతంగా గోదావరిలో పుష్కర స్నానం ఆచరించారు. ఆ తర్వాత పితృదేవతలకు పిండప్రదానం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇన్ని రోజుల పాటు పుష్కరాలు ఎంతో గొప్పగా జరిగాయని అన్నారు. అలాగే పుష్కరాల ముగింపు వేడుక అద్భుతంగా ఉండాలని... ఈ వేడుకలు ప్రజలకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారని చెప్పారు. అందుకే, తాను రాజమండ్రి వచ్చానని... ముగింపు వేడుకలను కన్నుల పండువగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, పుష్కరాల ముగింపు సమయాన జరిగే హారతి ఉత్సవం నిర్వహణ బాధ్యతను బోయపాటికి చంద్రబాబు అప్పజెప్పారు.

More Telugu News