: అనంత చేరుకున్న రాహుల్... ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లా చేరుకున్నారు. జిల్లాలో చేపట్టనున్న పాదయాత్ర కోసం నేటి ఉదయం ఢిల్లీ నుంచి విమానం ద్వారా బెంగళూరు చేరుకున్న ఆయన ఆ తర్వాత రోడ్డు మార్గం మీదుగా అనంతపురం జిల్లా కొడికొండ చెక్ పోస్ట్ చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యకర్తల హర్షధ్వానాల మధ్య కొడికొండ చెక్ పోస్ట్ నుంచి ఆయన ఓబుళదేవర చెరువుకు బయలుదేరారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్న ఆయన ఆ తర్వాత బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి యాత్రను ప్రారంభిస్తారు.

More Telugu News