: 'అహల్య' అద్భుతం: అమితాబ్ బచ్చన్

రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించిన లఘు చిత్రం 'అహల్య' అద్భుతంగా ఉందని బాలీవుడ్ దిగ్గజనటుడు అమితాబ్ బచ్చన్ కితాబిచ్చారు. షార్ట్ ఫిల్మ్ లో సౌమిత్రా ఛటర్జీ, రాధికా అప్టే నటన అద్భుతమని ఆయన పేర్కొన్నారు. 'షార్ట్ ఫిల్మ్ ల మ్యాజిక్ అంటే ఇదే, సుజోయ్ ఘోష్ అద్భుతం' అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, 14 నిమిషాల 10 సెకెన్ల నిడవి గలిగిన 'అహల్య' లఘుచిత్రం పురాణాలలో అహల్య పాత్ర కథావస్తువుగా రూపొందింది. మిస్సింగ్ కేసు దర్యాప్తు నిమిత్తం ఓ ఇంటికెళ్లిన పోలీసు అధికారి, ఆ ఇంట్లోని మహిళను తప్పుడు దృష్టితో చూసి ప్రతిమగా మారిపోవడం కథ. దానిని సుజోయ్ ఘోష్ రూపొందించిన విధానానికి సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News