: సభకు వచ్చే ముందు కాంగ్రెస్ నేతలు హోంవర్క్ చేసుకుని రావాలి: కేంద్ర మంత్రి నక్వీ

కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటుకు వచ్చే ముందు తగినంత హోంవర్క్ చేసుకుని రావాలని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ సూచించారు. అంటే మాట్లాడాల్సిన అంశాలపై ముందుగా ప్రిపేర్ అయి వచ్చి సభను సజావుగా నడవనివ్వాలని కోరారు. ఎలాంటి హోంవర్క్ చేయకుండా సభకు వచ్చి, వారి ఉచ్చులో వారే బిగుసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈరోజు రాజ్యసభలో విపక్ష ఉపనేత ఆనంద్ శర్మ ఇచ్చిన నోటీసును ఉద్దేశించి నక్వీ పైవిధంగా మాట్లాడారు. శర్మ ఇచ్చిన నోటీసులో ఎవరి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారో తెలపలేదని, కానీ సభలో మాత్రం మంత్రులు రాజీనామా చేయాలని అరుస్తుంటారని అన్నారు. ఇలా పార్లమెంటు సమయాన్ని వృథా చేయవద్దని చెప్పారు. దేశ ప్రజలు వాళ్లను క్షమించరని మంత్రి మండిపడ్డారు.

More Telugu News