: భూమిలాంటి గ్రహం దొరికింది... 'బిగ్ ఎనౌన్స్ మెంట్' చేయనున్న నాసా!


అనంత విశ్వంలో మరో భూమిని నాసా కనుగొన్నదా? అవుననే సమాధానం వినిపిస్తోంది. భూమిపై కాకుండా మరో నివాసయోగ్యమైన గ్రహం ఎక్కడుందోనన్న విషయమై ఎన్నో ఏళ్లుగా జరుపుతున్న ప్రయోగాలు ఫలించాయని, మరో భూమి కనిపించిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించేందుకు నేడు మీడియా సమావేశం నిర్వహించాలని నాసా అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. నాసా అధికారిక వెబ్ సైటులోని వివరాల ప్రకారం ఉదయం 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం నేటి సాయంత్రం 7 గంటలకు) మీడియా బ్రీఫింగ్ జరగనుంది. కెప్లర్ మిషన్ లో భాగంగా తాము కనుగొన్న నూతన విషయాలను నాసా తెలియజేయనుందని తెలిసింది. కెప్లర్ టెలిస్కోప్ ఇప్పటివరకూ 1000కి పైగా గ్రహాలను కనుగొంది. వీటిల్లో భూమిని పోలి నివాసయోగ్యంగా ఉన్న గ్రహం వివరాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.

  • Loading...

More Telugu News