: కబ్జాకు అడ్డొచ్చిన మహిళను ట్రాక్టర్ తో తొక్కించిన లేడీ డాన్!

ఈ వీడియో చూస్తే కోపంతో రగిలిపోవాల్సిందే. ఓ భూమిని కబ్జా చేసేందుకు వచ్చిన లేడీడాన్ దౌర్జన్యానికి నిదర్శనమిది. వివరాల్లోకి వెళితే, యూపీలోని బిజ్నోలో ఓ స్థలానికి సంబంధించిన నకిలీ దస్తావేజులతో వచ్చిన లేడీ రౌడీ వీరంగం సృష్టించింది. ఓ రివాల్వరును నడుములో దోపుకొని ట్రాక్టరు నడుపుతూ వచ్చిన ఆమె పొలంలోకి వెళ్లి పంటను నాశనం చేసింది. అడ్డొచ్చిన ఓ యువతిపైకి నిర్దయగా ట్రాక్టరును ఎక్కించింది. తుపాకీతో బెదిరించింది. ఈ మొత్తం దృశ్యాలూ వీడియోలో కూడా రికార్డు అయ్యాయి. ట్రాక్టరు కింద గాయపడిన మహిళను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పోలీసులు సైతం వెంటనే స్పందించలేదంటే, ఆ డాన్ పరపతి ఎటువంటిదో తెలుస్తోంది. చివరకు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు, లేడీ డాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇప్పటికీ ఆమెపై కేసు నమోదు కాలేదని సమాచారం. ఈ వీడియోను మీరూ చూడాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి. https://www.ap7am.com/lv-193768-pistol-carrying-lady-don-tries-to-grab-church-land-in-up.html

More Telugu News