: జడేజాకు మొండిచేయి... లంక టూర్ కు ‘సర్’ స్థానంలో అమిత్ మిశ్రా
శ్రీలంక టూర్ కు వెళుతున్న టీమిండియా జట్టును కొద్దిసేపటి క్రితం సెలెక్టర్లు ఖరారు చేశారు. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు (సర్-నిక్ నేమ్) మొండిచేయి చూపించిన సెలెక్టర్లు అతడి స్థానంలో అమిత్ మిశ్రాకు చోటు కల్పించారు. కొద్దిసేపటి క్రితం భేటీ అయిన సెలెక్షన్ కమిటీ లంక టూరుకు వెళ్లనున్న జట్టును ఎంపిక చేసింది. జట్టులో విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, రోహిత్ శర్మ, అజింక్యా రెహానే, శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ ఆరోన్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా ఉన్నారు.