: మెసేజింగ్ యాప్ టెలిగ్రాంను నిషేధించిన చైనా


మెసేజింగ్ యాప్ టెలిగ్రాం చైనాలో నిషేధానికి గురైంది. మానవ హక్కుల సంఘాలకు చెందిన న్యాయవాదులు ఈ యాప్ ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో దీనిని నిషేధించారు. దీంతో బీజింగ్, షెంజాన్, ఇన్నర్ మంగోలియా, హెలాంగ్జియాంగ్, యున్నన్ ప్రాంతాల్లో సర్వర్లను నిలిపేశారు. ఈ మధ్య కాలంలో చైనాలోని మానవ హక్కుల న్యాయవాదులు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆందోళనలు రేగాయి. దీంతో 23మంది న్యాయవాదులను చైనా ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. టెలిగ్రాం మెసేజింగ్ యాప్ ద్వారా రహస్య సమాచారం బట్వాడా చేసుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. కాగా, ఏషియా ఫసిఫిక్ ప్రాంతంలో మెసేజింగ్ యాప్ ద్వారా సైబర్ అక్రమాలకు పాల్పడుతున్నారని యాప్ రూపకర్త పావెల్ డురోవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో చైనాలో ఈ యాప్ ను నిషేధించడం విశేషం.

  • Loading...

More Telugu News