: మహ్మద్ ప్రవక్త జీవించి ఉన్న కాలం నాటి ఖురాన్ లభ్యం

ముస్లింల పవిత్ర గ్రంధం ఖురాన్ కి సంబంధించిన అత్యంత పురాతనమైన రెండు భాగాలు ఇంగ్లండ్ లో లభ్యమయ్యాయి. బర్మింగ్ హామ్ యూనివర్సిటీ లైబ్రరీలో వీటిని గుర్తించినట్టు అధ్యాపకులు తెలిపారు. ఈ ప్రతులను ప్రతిష్ఠాత్మకమైన ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో క్షుణ్ణంగా పరిశీలించగా, ఈ ఖురాన్ దాదాపు 1,370 సంవత్సరాల క్రిందటిదని తేలింది. క్రీస్తు శకం 568 నుంచి 645 మధ్యకాలంలో దీనిని రాసినట్టు గుర్తించారు. దీంతో, ఈ ఖురాన్ మహ్మద్ ప్రవక్త జీవించి ఉన్న కాలం నాటిదని అధ్యాపకులు భావిస్తున్నారు.

More Telugu News