: అవినీతికి పాల్పడిన 1700 మందిని శిక్షించిన సీవీసీ

వివిధ కేంద్ర విభాగాల్లోను, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లోను పనిచేస్తూ, అవినీతికి పాల్పడిన 1700 మందికి పైగా ఉద్యోగులకు ఈ సంవత్సరం శిక్షలు పడ్డాయని సీవీసీ (కేంద్ర విజిలెన్స్ కమిషన్) వెల్లడించింది. జూన్ 30 వరకూ 1,738 మంది ఉద్యోగులపై శిక్షలను ఖరారు చేశామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మొత్తం 2,357 అవినీతి ఫిర్యాదులు సీవీసీకి అందాయని తెలిపారు. అంతకుముందు 2014లో 5,492, 2013లో 5,423 ఫిర్యాదులు రాగా, 2014లో 2,144, 2013లో 2680 మందిపై సస్పెన్షన్, జరిమానాలు తదితర శిక్షలను సీవీసీ విధించినట్టు వివరించారు.

More Telugu News