: తమిళనాడులో బాహుబలి థియేటరుపై పెట్రోలు బాంబు దాడి
సూపర్ హిట్ చిత్రం 'బాహుబలి'లో గిరిజనులను కించపరిచేలా డైలాగులున్నాయని ఆరోపిస్తూ, తమిళనాడులోని మధురైలో చిత్ర ప్రదర్శన జరుగుతున్న థియేటరుపై నిరసనకారులు దాడి చేశారు. 'తమిళ పులి' సంస్థకు చెందిన కార్యకర్తలు థియేటరుపై పెట్రోలు బాంబును విసిరారు. గిరిజనులను కించపరిచేలా ఉన్న డైలాగులను తక్షణం తొలగించాలని వారు డిమాండు చేశారు. ఈ ఘటనలో ప్రేక్షకులెవరికైనా గాయాలు అయినట్టు సమాచారం అందలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు థియేటరు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ చిత్రంలో మాలలను అవమానపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ, తెలంగాణ మాలల జాయింట్ యాక్షన్ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.