: జైరాం రమేష్ పై రాజస్థాన్ సీఎం కుమారుడి పరువునష్టం దావా

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తో బాటు, ఓ టీవీ చానల్ పై రాజస్థాన్ సీఎం వసుంధరరాజే సింధియా కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. జైపూర్ లోని దోల్ పూర్ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. "ఐపీసీ సెక్షన్ 500 కింద జైరాంపైన, ఓ టీవీ చానల్ పైన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు మేము ఓ ఫిర్యాదు దాఖలు చేశాం" అని దుష్యంత్ లాయర్ బజ్వా తెలిపారు. దోల్ పూర్ ప్యాలెస్ దుష్యంత్ సింగ్ ది కాదని, ప్రభుత్వానికి చెందినదంటూ జైరాం అన్నట్టు కొన్ని మీడియా సంస్థలు పేర్కొన్నాయన్నారు. అంతేగాక తప్పుడు కారణాలతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దుష్యంత్ నష్టపరిహారం తీసుకున్నారని ఆరోపించారని లాయర్ తెలిపారు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవమని, ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

More Telugu News