: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం ‘అమరావతి అండ్ కో’... ఏపీ, సింగపూర్, జపాన్ భాగస్వామ్యంలో కొత్త సంస్థ!

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కొత్త కంపెనీ పుట్టుకొస్తోంది. ‘అమరావతి అండ్ కో’ పేరిట రంగప్రవేశం చేయనున్న ఈ కంపెనీలో ఏపీ సర్కారుతో పాటు సింగపూర్, జపాన్ ప్రభుత్వాలు భాగస్వాములు కానున్నాయని తెలుస్తోంది. స్పెషల్ పర్పస్ వెహికిల్ గా అరంగేట్రం చేయనున్న ఈ కంపెనీలో నయాపైసా పెట్టుబడి పెట్టకుండా కేవలం భూములే పెట్టుబడులుగా ఏపీ 25 శాతం వాటాదారుగా చేరనుంది. ఇక రాజధాని నిర్మాణంలో కీలక భూమిక పోషించనున్న సింగపూర్ లేదా జపాన్ ప్రభుత్వానికి 50 శాతం వాటా ఇస్తారట. ఈ కొత్త కంపెనీలో భాగస్వామ్యానికి ఇప్పటికే సింగపూర్, జపాన్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి.

More Telugu News