: అప్పట్లో ఆయనను ఆవహించిన ఆత్మే ఇప్పుడు కేసీఆర్ ను ఆవహించింది: నాగం

తెలంగాణ సర్కారుపై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో పాలన అదుపు తప్పిందని అన్నారు. ప్రాజెక్టులు నత్తనడక నడుస్తున్నాయని, నిధుల చెల్లింపులు జరగడం లేదని మండిపడ్డారు. స్వార్థపూరిత ప్రయోజనాల నేపథ్యంలోనే నిధులు ఆపారని ఆరోపించారు. కేసీఆర్ భారీ కాంట్రాక్టులన్నీ అనుచరులకే అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. అప్పట్లో ఓ ముఖ్యమంత్రిని ఆవహించిన ఆత్మ ఇప్పుడు కేసీఆర్ ను ఆవహించిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సర్కారును ఇప్పుడు ఆ ఆత్మే నడిపిస్తోందని పేర్కొన్నారు. కాగా, కేవీపీ రామచంద్రరావు తన ఆత్మ అని దివంగత వైఎస్సార్ అప్పట్లో పలుమార్లు పేర్కొనడం తెలిసిందే. ఇటీవల కేవీపీతో కేసీఆర్ రహస్యంగా భేటీ అయ్యారంటూ వార్తొలొచ్చాయి.

More Telugu News