: 'చిన్ మున్'ను పుష్కర స్నానం చేయనివ్వని పోలీసులు!
చిన్ మున్ వస్తే పుష్కర స్నానం చేసేందుకు కొవ్వూరు ఘాట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇంతకీ చిన్ మున్ ఎవరని అనుకుంటున్నారా? విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంతోష్ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క. ఎంచక్కగా మిడ్డీ ధరించి తన యజమానితో కలసి పుష్కర స్నానానికి వచ్చింది. తీరా స్నానం చేయిద్దామని తీసుకుపోవాలని సంతోష్ భావించగా, కుక్కలకు పుష్కర స్నానం అనుమతి లేదంటూ పోలీసులు పంపేశారు. అయితేనేం చూడముచ్చటగా ఉన్న ఆ కుక్కను యాత్రికులు ముచ్చటగా చూశారు.