: కొవ్వూరులో ఎంపీ గంగరాజు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పుష్కరస్నానాలు

ఏపీలో రాజకీయ నేతలు వరుసగా పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు వీఐపీ పుష్కర ఘాట్ లో బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు, టీడీపీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్నానాలు చేశారు. జేసీ కుటుంబసభ్యులతో కలసి పుణ్యస్నానాలు చేసి గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. రాయలసీమలో వర్షాలు కురవాలని కోరుకున్నట్టు తెలిపారు. పుష్కరాల ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. పుష్కర స్నానాలు చేయడంవల్ల సర్వపాపాలు హరిస్తాయని గోకరాజు అన్నారు. గోదావరిలో పుష్కర స్నానం చేశాక గోష్పాదక్షేత్రంలో ఎంపీ పిండప్రదానం చేశారు. అంతకుముందు గోదావరిలో ఆయన సరదాగా ఈత కొట్టారు.

More Telugu News