: గోదావరి పుష్కర ఘాట్ లో సింగపూర్ మంత్రి... హారతిని సెల్ ఫోన్ లో చిత్రీకరించుకున్న వైనం

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ తో నిన్న రాజమండ్రి చేరుకున్న సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ గోదావరి పుష్కర ఘాట్ ను సందర్శించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పుష్కర ఘాట్ కు చేరుకున్న ఈశ్వరన్ అక్కడే మెట్లపై కూర్చున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఏపీ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ల మధ్య కూర్చుని గోదావరి తల్లికి ఇస్తున్న హారతిని ఆయన ఆసక్తిగా తిలకించారు. సదరు అపురూప దృశ్యాన్ని చూసి ఆయన మైమరచిపోయారు. కలకాలం గుర్తుండేలా ఆ దృశ్యాన్ని ఆయన తన సెల్ ఫోన్ లో నిక్షిప్తం చేసుకున్నారు.

More Telugu News