: దసరా రోజున అమరావతికి శంకుస్థాపన... నరేంద్ర మోదీ హాజరవుతారన్న చంద్రబాబు

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి విజయదశమి(దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 22న శంకుస్థాపన జరగనుంది. ఈ మేరకు నిన్న సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి ఈశ్వరన్ నుంచి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ ను అందుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని చెప్పిన చంద్రబాబు, కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సింగపూర్, జపాన్ దేశాల ప్రధాన మంత్రులకు కూడా ఆహ్వానం పంపామని చంద్రబాబు చెప్పారు.

More Telugu News