: మహిళా తహశీల్దార్ పై దాడి ఘటనలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు

కృష్ణా జిల్లా ముసునూరు మహిళా తహశీల్దార్ పై దాడి ఘటనలో ఏపీ ప్రభుత్వానికి ఎన్ హెచ్ఆర్ సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. కొన్ని రోజుల కిందట జరిగిన దాడి ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా తీసుకుని విచారించింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న కారణంగా టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దాంతో రెవెన్యూ సంఘాలు, రాజకీయ పార్టీలు అమెకు మద్దతుగా నిలిచి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

More Telugu News