: 35 ఏళ్లుగా పనిచేస్తున్న జే&కే రాష్ట్ర క్రికెట్ అధ్యక్షుడి తొలగింపు

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను తొలగించారు. గత 35 ఏళ్లుగా ఆయన జే&కే క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. బీసీసీఐ నుంచి మంజూరైన నిధులను ఆయన దుర్వినియోగం చేశారంటూ ఆయనపై పిటిషన్ దాఖలైంది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆయనను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన అధ్యక్షుడిగా కొనసాగడానికి అర్హుడు కాడంటూ జమ్మూకాశ్మీర్ క్రికెట్ సంఘం సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనిపై జరిగిన ఓటింగ్ లో 64 మంది సభ్యులున్న సంఘంలో 45 మంది ఆయనను వ్యతిరేకించారు. దీంతో ఆయనపై వేటు పడింది. ఇకపై జమ్మూకాశ్మీర్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ఇమ్రాన్ రజా అన్సారీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీనిపై ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ, అధ్యక్షుడిగా తనను తొలగించడం అన్యాయమని, చట్ట వ్యతిరేకమని అన్నారు.

More Telugu News