: బీసీసీఐ 'వర్కింగ్ గ్రూప్ కమిటీ'లో గంగూలి... దాదా చేతిలో చెన్నై, రాజస్థాన్ జట్ల భవితవ్యం

ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ను నిషేధించాలని జస్టిస్ లోథా కమిటీ ఇచ్చిన తీర్పును అధ్యయనం చేయడానికి బీసీసీఐ ఒక 'వర్కింగ్ గ్రూప్ కమిటీ'ని ఏర్పాటు చేసింది. ఐదుగురు సభ్యులుగా గల ఈ కమిటీలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి స్థానం కల్పించారు. గంగూలీతో పాటు బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ లీగల్ హెడ్ ఉషాంత్ బెనర్జీ, ట్రెజరర్ అనిరుధ్ చౌదరిలు కమిటీలో ఉన్నారు. ఈ కమిటీ ఆరు వారాల్లోగా లోథా తీర్పును అధ్యయనం చేసి బీసీసీఐకి నివేదికను అందజేస్తుంది. ఆ తర్వాత బీసీసీఐ వర్కింగ్ కమిటీతో ఈ గ్రూప్ కమిటీ చర్చలు జరుపుతుంది. అనంతరం రెండు జట్లపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. సో, ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, ద్రావిడ్ సేవలు అందిస్తున్న రాజస్థాన్ రాయల్స్ భవితవ్యం గంగూలీ నిర్ణయంపై ఆధారపడినట్టైంది.

More Telugu News