: ప్రత్యేక హోదా కోసం మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం: సుజనాచౌదరి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తున్నామని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రాధాన్యత అంశంగా చర్చించాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని చెప్పారు. విభజన సమస్యల పరిష్కారానికి అవసరమైతే చట్టంలో మార్పులు చేయాలని కూడా కోరతామని సుజనా పేర్కొన్నారు. రేపటి నుంచి ప్రారంభంకాబోతున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఇదే విషయాన్ని తాము చెప్పామని ఉద్ఘాటించారు.

More Telugu News