: ఏపీలో సమస్యలు ఎర్రజెండాల నేతలకు కనిపించట్లేదా?...లెఫ్టిస్టులపై కల్వకుంట్ల కవిత ఫైర్
వామపక్ష పార్టీల నేతలపై నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. రేపు ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల దరిమిలా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కవిత కమ్యూనిస్టు నేతల వరుస ఆందోళనలపై విరుచుకుపడ్డారు. కార్మికులకు ఒక్క తెలంగాణలోనే సమస్యలు ఎదురవుతున్నాయా? అని నిలదీసిన ఆమె, ఏపీలో కార్మికుల హక్కులకు భంగం కలగడం లేదా? అని ప్రశ్నించారు. ఏపీలో అంగన్ వాడీల సమస్యలు కమ్యూనిస్టులకు కనిపించడం లేదా? అని ఆమె వామపక్షాల నేతలను నిలదీశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో హైకోర్టు విభజనే తమ తొలి ప్రాధాన్యమని ఆమె పేర్కొన్నారు.