: జింబాబ్వేతో టీ20... టీమిండియా టార్గెట్ 146
హరారేలో టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో జింబాబ్వే ఏడు వికెట్లు నష్టపోయి 145 పరుగులు చేసింది. ఓపెనర్ చిబాబా అద్భుతమైన ఆటతీరును కనబరచి 67 (51 బంతులు, 9 ఫోర్లు) పరుగులు చేశాడు. మరో ఓపెనర్ మసకద్జ (19), విలియమ్స్ (17) పరుగులు చేయగా... ఎక్స్ ట్రాల రూపంలో 16 పరుగులు వచ్చాయి. మిగిలిన బ్యాట్స్ మెన్ లు ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మలు చెరో 2 వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, బిన్నీ, అక్షర్ పటేల్ లు చెరో వికెట్ కైవసం చేసుకున్నారు. కాసేపట్లో 146 పరుగుల విజయలక్ష్యంతో భారత బ్యాటింగ్ ఆరంభం కానుంది.