: ఓటుకు నోటు కేసులో దేశం నేత ప్రదీప్ కు నోటీసులు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణలో భాగంగా తెలంగాణ ఏసీబీ మరో అడుగు ముందుకేసింది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నేత ప్రదీప్ కు ఏసీబీ నోటీసులు పంపింది. సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన ఏసీబీ, రేపు ఉదయం 10:30 గంటలకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా, ప్రదీప్ ప్రస్తుతం హైదరాబాద్ తెలుగుయువత విభాగానికి ఉపాధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నారు. యువనేత లోకేష్ తో ప్రదీప్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది.