: ఎక్కువ సేపు కూర్చునే మహిళలకు క్యాన్సర్ ముప్పు!
ఎలాంటి శారీరక శ్రమ లేకుండా, ఎక్కవ సేపు కూర్చునే మహిళల్లో క్యాన్సర్ వచ్చే ముప్పు 10 శాతం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం తెలిపింది. అయితే, మగవారిలో మాత్రం ఎక్కువ సేపు కూర్చోవడానికి, క్యాన్సర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. 1999 నుంచి 2009 వరకు దాదాపు 69 వేల మంది పురుషులు, 77 వేల మంది స్త్రీలపై కొనసాగిన పరిశోధనల్లో ఈ విషయాన్ని గుర్తించారు. కాబట్టి క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే... శారీరక శ్రమకు ఉన్న ప్రాధాన్యతను మహిళలు గుర్తించాలి.