: బ్లాక్ లో 'బాహుబలి' టికెట్ 2 వేలు?


'బాహుబలి' సినిమా విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల ఆసక్తి పెరిగిపోతోంది. మొదటి రోజు మొదటి షో చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. హైదరాబాదు, కూకట్ పల్లిలోని విశ్వనాథ్ థియేటర్ వద్ద 'బాహుబలి' సినిమా టికెట్లు బ్లాక్ లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో టికెట్ రెండు వేల రూపాయల చొప్పున అమ్ముతున్నట్టు వారు వెల్లడించారు. కాగా, మరి కొన్ని చోట్ల 5 వేల రూపాయల వరకు 'బాహుబలి' టికెట్ అమ్ముడవుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News