: మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను నాశనం చేసేందుకు రూ. 20 కోట్లిచ్చిన నెస్లే
మార్కెట్లో నుంచి వెనక్కు తెచ్చిన మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లను నాశనం చేసేందుకు నెస్లే సంస్థ రూ. 20 కోట్లను వెచ్చించింది. ఈ ప్యాకెట్లను కాల్చివేసేందుకు అంబుజా సిమెంట్స్ తో డీల్ కుదుర్చుకున్న నెస్లే మహారాష్ట్రలోని చంద్రపూర్ లో నిర్వహిస్తున్న సిమెంటు ఫ్యాక్టరీలో వీటిని దహనం చేస్తోంది. అందుకుగాను డబ్బును కూడా చెల్లించినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై నెస్లేని సంప్రదించగా, అంబుజా సిమెంట్స్ వారు మ్యాగీని నాశనం చేసేందుకు సహకరిస్తున్నారు. ఈ ప్యాకెట్లను తాము మార్కెట్ నుంచి వెనక్కు తెచ్చామని తెలిపారు. దీనికోసం ఎంత ఖర్చు పెడుతున్నామన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. తయారీ ఖర్చుతో పాటు, వాటిని మార్కెట్లోకి పంపి, ఆపై వెనక్కు తెచ్చి, ఇప్పుడు దహనం చేస్తున్న నెస్లేపై మ్యాగీ నూడుల్స్ వేసిన ఖర్చు భారం తడిసి మోపెడవుతోంది.