: బాంబు బెదిరింపుతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దిగిన విమానం
బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళుతున్న టర్కిష్ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఆ విమానానికి బాంబు బెదిరింపు రావడంతోనే విమానం అత్యవసరంగా దిగినట్టు తెలిసింది. ఆ సమయంలో విమానంలో ఉన్న 148 మంది ప్రయాణికులను వెంటనే దించి వేశారు. మరోవైపు విమానాశ్రయంలో హై అలెర్ట్ ప్రకటించారు.