: వ్యవసాయ రంగంలో డిజిటలైజేషన్... ఇక్రిశాట్ తో తెలంగాణ ప్రభుత్వ ఒప్పందం


వ్యవసాయ రంగంలో కొత్త పుంతలు తొక్కేందుకు ఇక్రిశాట్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎంఓయూ కుదిరింది. వ్యవసాయ, ఐటీ మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా ఇక్రిశాట్ సాయంతో వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతుల్లో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సచివాయంలో ఈరోజు మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి 'అగ్రి ఫ్యాబ్లెట్'ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఇక్రిశాట్ వంటి సంస్థ తెలంగాణలో ఉండటం గర్వకారణమన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని తెలిపారు. డ్రిప్, మైక్రో ఇరిగేషన్ కు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందన్నారు. కాగా, దీంతో తెలంగాణా ప్రభుత్వం వ్యవసాయరంగంలో డిజిటలైజేషన్ ను తీసుకువచ్చినట్టయింది.

  • Loading...

More Telugu News