: నదిలో నీరు లేక రోడ్డెక్కిన భారీ మొసలి... చూసేందుకు ఎగబడ్డ జనం

నిజమేనండోయ్, దాదాపు 200 కిలోల బరువున్న భారీ మొసలి ఒకటి రోడ్డుపైకి వచ్చింది. కారణమేంటంటే, తానుంటున్న మంజీరా నదిలో నీరు లేదట. మరి మొసలికి నీరే జీవనాధారం కదా. మెదక్ జిల్లాలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో ప్రస్తుతం నీటిమట్టం దాదాపుగా అడుగంటిపోయింది. దీంతో దిక్కుతోచని ఈ మొసలి మనూరు మండలం షాపూర్ పరిధిలోని రోడ్డుపైకి వచ్చేసింది. నడిరోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షమవడంతో తొలుత గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ఆ తర్వాత కదలలేని భారీ మొసలిని చూసేందుకు ఆ గ్రామంలోని పిల్లలు, పెద్దలు ఎగబడ్డారు.

More Telugu News