: ‘హులా హూప్స్’తో 10 నిమిషాల్లో 100 కేలరీలు కగిరిపోతాయట!


నాజూకుదనం అంటే అమితాసక్తి చూపుతున్న నేటి యువత విభిన్న రీతుల కసరత్తులకు సై అంటోంది. మొన్నటికి మొన్న ‘క్రాస్ ఫిట్’ పేరిట ఎంటరైన వినూత్న వ్యాయామానికి జేజేలు పలుకుతున్న యువతరం, కొత్తగా రంగ ప్రవేశం చేసే ఏ రకమైన ఎక్సర్ సైజుకైనా ఇట్టే ఆకర్షితులవుతోంది. ప్రస్తుతం ‘క్రాస్ ఫిట్’ లానే ‘హులా హూప్స్’ పేరిట వచ్చిన ఎక్సర్ సైజు పట్ల కూడా యువత మక్కువ చూపుతోంది. రింగ్ ఆధారంగా వివిధ పద్ధతుల్లో సర్కస్ ఫీట్ల మాదిరి చేసే ఈ కసరత్తును 10 నిమిషాలు చేస్తే, శరీరంలోని 100 కేలరీలు ఇట్టే కరిగిపోతాయట. దీంతో ప్రపంచంలోని పలు దేశాల్లోని యువత ఈ హులా హూప్స్ తో చెమటోడుస్తోంది.

  • Loading...

More Telugu News