: టేబుల్ ఫ్యాన్ లో బంగారం...శంషాబాదు ఎయిర్ పోర్టులో 3 కిలోల బంగారం సీజ్
కస్టమ్స్ అధికారుల దాడులు ముమ్మరంగా సాగుతున్నా, విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో దేశంలోకి తరలివస్తున్న బంగారం స్మగ్లింగ్ కు చెక్ పడట్లేదు. ఇప్పటికే కిలోల లెక్కన వచ్చిన బంగారాన్ని నిఘా అధికారులు పట్టుకున్నా, అక్రమార్కులు ఏమాత్రం బెదరడం లేదు. నేటి ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానం నుంచి దిగిన ఓ వ్యక్తిని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఘా అధికారల కళ్లుగప్పేందుకు సదరు స్మగ్లర్ బంగారాన్ని టేబుల్ ఫ్యాన్ లో ఉంచి తీసుకువచ్చాడు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు స్మగ్లర్ ను పోలీసులకు అప్పగించారు.