: డిప్యూటీ కలెక్టర్ పేరిట చిరుద్యోగి హల్ చల్...అరదండాలేసిన నెల్లూరు జిల్లా పోలీసులు

అతడి పేరు ప్రసాద్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో చిరుద్యోగం వెలగబెడుతున్నాడు. అయితే చిరుద్యోగంతో అతడు సంతృప్తి చెందనట్టుంది. డిప్యూటీ కలెక్టర్ పేరిట జిల్లా పర్యటనకు బయలుదేరాడు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, సర్కారీ వైద్యాలయాల్లో తనిఖీలు చేశాడు. అక్కడి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. అయితే అతడిపై అనుమానం వచ్చిన కొందరు అతడి నకిలీ రూపాన్ని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగప్రవేశం చేసిన జిల్లాలోని జలదంకి పోలీసులు సదరు నకిలీ డిప్యూటీ కలెక్టర్ కు అరదండాలేశారు.

More Telugu News