: దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడు!: తలసానికి రేవంత్ రెడ్డి సవాల్
ఆలుగడ్డలు అమ్ముకునే వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి, పదవులు కల్పించి, సమాజంలో ఉన్నత హోదా కల్పిస్తే అలాంటి వ్యక్తి విమర్శలు చేస్తున్నాడని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన అనంతరం ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చేతనైతే అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేసి మాట్లాడాలని సవాలు విసిరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా విమర్శలు చేయడం గొప్పతనం కాదని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ లో చేర్చుకున్న టీడీపీ నేతలందరి చేతా రాజీనామా చేయించాలని ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ కు సూచించారు. ముందు మీ అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేసి విమర్శలు చేయండని ఆయన పార్టీలు మారిన నేతలకు హితవు పలికారు. అలా పార్టీలు మారి పదవులు అనుభవిస్తున్నవారు, అవి తాము పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.