: చెన్నై మెట్రో రైలులో ప్రయాణించిన స్టాలిన్, విజయకాంత్

చెన్నైలో కొత్తగా ప్రారంభమైన మెట్రో రైలులో ఈరోజు పలువురు రాజకీయ నేతలు ప్రయాణించారు. తొలి దశలో అలాండర్ నుంచి కోయంబేడ్ మధ్య ఈ సర్వీసు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనుచరులతో కలసి డీఎంకే నేత ఎంకే స్టాలిన్, మాజీ మేయర్ ఎం.సుబ్రమణ్యమ్, మరోవైపు డీఎండీకే వ్యవస్థాపకుడు, తమిళనాడు ప్రతిపక్ష నేత విజయకాంత్ మెట్రో రైలులో ప్రయాణించారు. అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రయాణం సమయంలో ఇతర ప్రయాణికులతో మాట్లాడానని, టికెట్ రేట్లు తగ్గించాలని వారు కోరినట్టు ఆయన చెప్పారు.

More Telugu News