: నాన్నగారు చిత్రమైన పేర్లు పెడుతుంటారు: రాజమౌళి

బాహుబలి, భల్లాలదేవ, బిజ్జలదేవ, కాలకేయ, శివగామి... ఇవన్నీ 'బాహుబలి' చిత్రంలోని ప్రధాన పాత్రల పేర్లు. వీటిపై దర్శకుడు రాజమౌళిని ఓ వార్తా చానల్ యాంకర్ స్పందన కోరింది. ఆ పేర్లెంతో చిత్రంగా ఉన్నాయని ఆమె అభిప్రాయడింది. దీనిపై జక్కన్న వివరణ ఇస్తూ... "నాన్నగారు చాలా చిత్రమైన పేర్లు పెడుతుంటారు... కాట్రాజ్ అని, టిట్లా అని... ఈ విధంగా అనేక పేర్లను పెడుతుంటారు" అని తెలిపారు. ఇక, బాహుబలి కథ కంటే ముందే పాత్రల పేర్లు పుట్టాయని అన్నారు. ప్రాజెక్టు ఆరంభం కాకముందే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆయా పాత్రల పేర్లు చెప్పారని, ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పారని, ఆ తర్వాతే 'బాహుబలి' కథ రూపుదిద్దుకుందని వివరించారు.

More Telugu News