: తన 'దామిని'ని గుర్తించలేకపోయిన రిషీ కపూర్
అప్పట్లో 'దామిని' సినిమా విమర్శకుల మెప్పు పొందింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను మీనాక్షి శేషాద్రి పోషించింది. ఆమె భర్తగా రిషీ కపూర్ నటించారు. తాజాగా, ఓ సినిమా షూటింగులో రిషీ ఉండగా, సెట్లోకి మీనాక్షి శేషాద్రి వచ్చింది. అయితే, ఆమెను చూసి రిషీ ఎవరో అనుకున్నారు. చాన్నాళ్ల తర్వాత చూడడంతో తొలుత ఆమెను పోల్చుకోలేకపోయారట. కాసేపటి తర్వాత ఆమె తన 'దామిని' అని గుర్తించిన రిషీ ఈ విషయాన్ని ట్విట్టర్లో పేర్కొన్నారు. మీనాక్షిని చూపుతూ ఓ ఫొటోను కూడా పోస్టు చేశారు. ఈమె ఎవరో చెప్పగలరా? అంటూ ఫ్యాన్స్ కు ఓ ప్రశ్న సంధించారు కూడా. ఇక, మీనాక్షి ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ లో భర్త హరీశ్ మైసూర్ తో ఉంటోందని, ఆమెకు ఇద్దరు పిల్లలని రిషీ తెలిపారు. బంధువుల కోసం భారత్ వచ్చిందని పేర్కొన్నారు.