: పవన్ కల్యాణ్ పై కడప వైసీపీ బీసీ కార్యదర్శి ఘాటు వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ వివాదాలపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆలస్యంగా స్పందించడంపైన, ఆయన ట్విట్టర్ వ్యాఖ్యలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. పవన్ వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళుతున్నాయని కడప వైసీపీ బీసీ కార్యదర్శి అంబకపల్లె నారాయణస్వామి, జిల్లా సంయుక్త కార్యదర్శులు వీరభద్రారెడ్డి, చంద్రమౌళి మండిపడ్డారు. ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించడానికి పవన్ వారం రోజులు సమయం తీసుకోవడం చూస్తుంటే టీడీపీ, బీజేపీలతో ట్యూషన్ చెప్పించుకోడానికే అన్నట్టుందని విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఇన్ని ఘటనలు చోటుచేసుకున్నా పవన్ ప్రశ్నించకుండా నోరు మూసుకున్నారా? నాలుక కోసుకున్నారా? లేక అధికార పార్టీలకు అమ్ముడుపోయారా? అని ఘాటుగా ప్రశ్నించారు. ఇప్పుడు ప్రశ్నించలేకపోతే ఇంకెప్పుడూ ప్రశ్నించలేరన్నారు. ఇకనైనా లెంపలేసుకొని రాజకీయ నటన మానుకోవాలని వైసీపీ నేతలు ఆయనకు సలహా ఇచ్చారు.

More Telugu News