: జూహీ చావ్లా, దియా మీర్జా, అమీషా పటేల్ బాటపట్టిన కల్కి కొచ్లిన్
బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ సీనియర్ నటీమణులు జూహీ చావ్లా, దియా మీర్జా, అమీషా పటేల్ బాటలో నడుస్తోంది. సినిమా ఆఫర్లు తగ్గడంతో సినీ నిర్మాతలుగా మారిన నటీమణుల జాబితాలో కల్కి కొచ్లిన్ స్థానం సంపాదించుకుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ భార్యగా సుపరిచితురాలైన కల్కి కొచ్లిన్, అతని నుంచి విడిపోయి సినీ నటిగా మారింది. 'మార్గరీటా విత్ స్ట్రా' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కల్కి కొచ్లిన్, తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మించేందుకు ప్రొడక్షన్ హౌస్ పెట్టినట్టు తెలిపింది.
'లిటిల్ ప్రొడక్షన్స్' అంటూ ట్విట్టర్ ద్వారా ప్రొడక్షన్ హౌస్ ను ప్రకటించిన కొచ్లిన్, దాని ద్వారా దర్శకురాలిగా మారనున్నానని ప్రకటించింది. అలాగే తన ఫేస్ బుక్ లింక్ లింక్ ను అభిమానులకు పరిచయం చేసింది. 'జిందగీ నా మిలేగా దుబారా', 'దేవ్ డీ' వంటి విజయవంతమైన సినిమాల్లో నటించిన కల్కి కొచ్లిన్, 'లవ్ ఎఫైర్', 'హంటర్' సినిమాల్లో నటిస్తున్నట్టు తెలిపింది.