: విశేషమైన ఆదరణ పొందుతున్న ప్రధాని 'సెల్పీ విత్ డాటర్'

ప్రధాని ప్రోత్సహిస్తున్న 'సెల్ఫీ విత్ డాటర్' కార్యక్రమం విశేషమైన ఆదరణ పొందుతోంది. హర్యానాలో రోజురోజుకి పెరిగిపోతున్న లింగ వివక్షను పారద్రోలేందుకు బీబీపూర్ సర్పంచ్ సునీల్ జగ్లాన్ 'సెల్ఫీ విత్ డాటర్' అనే బృహత్తర కార్యక్రమానికి నాంది పలికారు. తనలాగే కుమార్తెల తండ్రులంతా వారివారి కుమార్తెలతో సెల్ఫీలు దిగి, లింగ వివక్షను పారద్రోలాలని పిలుపునిచ్చారు. దీనిని అభినందించిన ప్రధాని మోదీ, దీనికి మద్దతు పలికారు. తండ్రులు పంపిన సెల్పీల్లో స్పూర్తిమంతమైన సెల్పీలను తాను రీట్వీట్ చేస్తానని మోదీ ప్రకటించారు. ఇలా దేశంలో నెలకొన్న లింగ వివక్షను పారద్రోలవచ్చని ఆయన భావించారు. ప్రధాని మద్దతివ్వడంతో 'సెల్పీ విత్ డాటర్' కార్యక్రమానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఎంతో మంది తండ్రులు తమ కుమార్తెలతో సెల్ఫీలు దిగి, మోదీతో రీట్వీట్ చేయించుకుంటున్నారు. వారిలో ప్రముఖులు, సాధారణ వ్యక్తులు, దేశ, విదేశాలకు చెందిన వారు ఉన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన కుమార్తెతో సెల్పీ దిగి ప్రధానికి పంపగా, దానిని ఆయన రీట్వీట్ చేశారు. బీజేపీ నేత కిరణ్ బేడీ తన తండ్రితో సెల్పీ దిగి ట్విట్టర్లో పెట్టగా దానిని కూడా ఆయన రీ ట్వీట్ చేశారు.

More Telugu News