: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐకి నోటీసు
వైకాపా అధినేత వైఎస్ జగన్ తదితరులపై ఉన్న అక్రమాస్తుల కేసుల దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందన్న విషయమై సమగ్ర వివరాలతో కూడిన నివేదికను ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు ఆలస్యం అవుతోందని విజయవాడకు చెందిన న్యాయవాది వై.వేదవ్యాస్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. దర్యాప్తు త్వరితగతిన పూర్తయి న్యాయం జరగకుంటే, అన్యాయం జరిగినట్టు అవుతుందని ఈ సందర్భంగా వేదవ్యాస్ అభిప్రాయపడ్డారు. ఆయనతో ఏకీభవించిన న్యాయమూర్తి, దర్యాప్తు పురోగతి వివరాలు కోరుతూ ఆదేశించారు.