: ఆడలేడని పక్కనబెట్టిన వాడికే పగ్గాలిచ్చి పంపుతున్నారు!
అజింక్యా రహానే... గత ఒకటిన్నర సంవత్సరం వ్యవధిలో భారత క్రికెట్ జట్టులో అత్యంత నిలకడగా ఆడిన ఆటగాడు. ఇటీవలి బంగ్లాదేశ్ పర్యటనలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం మాత్రమే లభించింది. తొలి మ్యాచ్ లో విఫలం కాగానే, నెమ్మదిగా ఉండే పిచ్ లపై ఆడలేడంటూ, రహానేను టీమిండియా పక్కనబెట్టింది. తరువాతి రెండు మ్యాచ్ ల తుది జట్టులో ఎంపిక చేయలేదు. ఆడలేడన్న కారణంతో బంగ్లా సిరీస్ లో వేటుపడ్డ రహానే నేడు జింబాబ్వే పర్యటనకు సారథిగా ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్ టూరుకు వెళ్లిన ఆటగాళ్లలో సగం మంది మాత్రమే జింబాబ్వే టూరుకు ఎంపికయ్యారు. 2016లో జరిగే టీ-20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని ఈ జట్టును ఎంపిక చేసినట్టు చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ ప్రకటించారు.