: కంగనా కత్తిసాము, గుర్రపుస్వారీ నేర్చుకుంటోంది!
కంగనా రనౌత్ పేరు బాలీవుడ్ లో మార్మోగిపోతోంది. 'క్వీన్', 'తను వెడ్స్ మను రిటర్న్స్' సినిమాల వరుస విజయాలతో వంద కోట్ల క్లబ్ లో చేరిన కంగనా, తాజాగా చారిత్రాత్మక సినిమాలో నటించేందుకు అంగీకరించింది. వీరనారి 'ఝాన్సీ లక్ష్మీ బాయి' జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో 'ఝాన్సీ లక్ష్మీ బాయి' పాత్ర కంగనాను బాగా ఆకట్టుకుందట. అందుకే ఈ సినిమా కోసం కత్తి సాము, గుర్రపు స్వారీ నేర్చుకుంటోందని ఈ సినిమా దర్శకుడు కేతన్ మెహతా తెలిపారు. వంద కోట్ల క్లబ్ లో చేరిన కంగనా సినిమాలను ఆచితూచి ఎంచుకుంటోంది.