: టీఆర్ఎస్ సర్కారు కుప్పకూలడం ఖాయం: ఏపీ మంత్రి రావెల

ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో టీఆర్ఎస్ సర్కారు కుప్పకూలడం ఖాయమని అన్నారు. తెలంగాణ సర్కారు చర్య అనైతికమని దుయ్యబట్టారు. ఇక, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఏపీ సీఎం చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని రావెల వ్యాఖ్యానించారు. తలసాని ఓ రాజకీయ వ్యభిచారి అని విమర్శించారు. అటు, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తల్లి మెడకే ఉరేసిన చందాన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సెక్షన్-8ని అమలు చేయకుంటే హైదరాబాదును యూటీ చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News