: పట్టాలపై నుంచి ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన రైలు
పట్టాలపై కుదుపులు లేకుండా, ప్రశాంతంగా వెళ్లాల్సిన రైలు భయోత్పాతాన్ని సృష్టించింది. ఏకంగా ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చి, ప్రయాణికుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఘటన ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే చర్చి గేట్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. ఈ మధ్యాహ్నం స్టేషన్లో ఆగాల్సిన చోట ఆగకుండా ఓ లోకల్ ట్రైన్, డెడ్ ఎండ్ వరకు వెళ్లి, బఫర్లను గుద్దుకుని ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో డ్రైవర్ తో పాటు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై విచారణ ప్రారంభమయింది. రైలు ఎక్కువ వేగంతో వచ్చిందా? లేక బఫర్లలో ఏదైనా లోపముందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.